Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని ఆవేదన అర్థమైంది: మంత్రి నారాయణ

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆవేదన అర్థమైందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అధికారుల మధ్య ఉన్న సమన్వయలోపంతో వివాదాలు రాజుకుంటున్నాయని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, అధికారులు తమను సంప్రదించడం లేదని, ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించిన సంగతి తెలిసిందే.

More Telugu News